ETV Bharat / state

దొరికిన డబ్బులపై భాజపా నాయకుల పూటకో మాట: హరీశ్ రావు - తొగుటలో భాజపా నేతలపై హరీశ్ రావు విమర్శలు

దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటమి భయంతోనే... భాజపా నాయకులు నాటకాలు ఆడుతున్నారని మంత్రి హరీశ్​ రావు విమర్శించారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా.. గెలిచేది తెరాసనేనని స్పష్టం చేశారు.

harish rao
దొరికిన డబ్బులపై భాజపా నాయకుల పూటకో మాట: హరీశ్ రావు
author img

By

Published : Oct 27, 2020, 5:09 PM IST

Updated : Oct 27, 2020, 9:14 PM IST

దుబ్బాక ఉపఎన్నికలో ఓటమి భయంతోనే భాజపా నాటకాలాడుతోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సిద్దిపేటలో దొరికిన నగదుపై భాజపా నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పోలీసుల విడుదల చేసిన దృశ్యాలతో అసలు విషయం బయటపడిందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం తొగుటలో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీశ్​... కేంద్ర నుంచి విడుదలైన నిధులపై తెరాస విసిరిన సవాల్​కు సమాధానం చెప్పలేకే డబ్బుల పేరుతో భాజపా నేతలు నాటకాలాడుతున్నారని ఘాటుగా విమర్శించారు.

డిసెంబర్ 9నాడు వచ్చిన తెలంగాణ వెనక్కుపోతే అందరు రాజీనామాలు చేశారు. కానీ భాజపా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాత్రం రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. ఇయ్యాల తెలంగాణకు నేను వారసుడిని ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. భాజపా అధికారంలోకి వస్తే నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షల వేస్తమని ఆరేళ్లైంది, ఇస్తామన్న కోటి ఉద్యోగాలు ఎటుపోయాయన్నారు. నిజామాబాద్​లో తాను గెలిస్తే... పసుపు బోర్డు తెస్తానని అర్వింద్ బాండ్ పేపర్ రాసిచ్చాడు. పసుపు బోర్డు వచ్చిందా అని ప్రశ్నించారు. రైతులను మోసం చేసి పదవిలోకి వచ్చిన అర్వింద్... నేడు దుబ్బాక ప్రజలను మోసం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోమన్నారు.

దొరికిన డబ్బులపై భాజపా నాయకుల పూటకో మాట: హరీశ్ రావు

భాజపా ప్రభుత్వం మార్కెట్లను రద్దు చేసి రైతులను కష్టాల్లోకి నెట్టిందని విమర్శించారు. బావుల దగ్గర విద్యుత్ మీటర్లు పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ముత్యం రెడ్డి మంచి నాయకుడని మొసలి కన్నీరు కారుస్తోన్న కాంగ్రెస్... 2018లో టికెట్ ఎందుకివ్వలేదని ఉత్తమ్ కుమార్​ రెడ్డిని ప్రశ్నించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగ శాతం ఎక్కువగా ఉందని, దేశంలో 6.9% నిరుద్యోగ ఉంటే తెలంగాణలో కేవలం 3.3 శాతం మాత్రమే ఉందని పేర్కొన్నారు. దుబ్బాక అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే తెరాస అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తే... ఎంపీ ప్రభాకర్ రెడ్డి తాను కలిసి అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.

ఇదీ చూడండి: నగదు దొరికినా నాటకాలేంటి: హరీశ్​రావు

Last Updated : Oct 27, 2020, 9:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.