సిద్దిపేటలో 500 మంది పేద పాస్టర్లకు మంత్రి హరీశ్ రావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో ఒకరికొకరికి సాయం చేస్తూ మానవత్వం చాటుకోవాలని కోరారు.
నిత్యావసర సరుకులు, కిట్స్‌ను ఏసుప్రభువు కానుకగా చూడాలని మంత్రి పాస్టర్లను కోరారు. పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.