ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు అండగా నిలుస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలోని తన నివాసంలో నియోజకవర్గ పరిధిలోని 8 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. చెక్కులు వెంటనే తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని మంత్రి సూచించారు.
సిద్దిపేట పట్టణంలో ఇద్దరు, రూరల్ మండలంలో మరో ఇద్దరు, చిన్నకోడూరు మండలంలో-2, నంగునూరులో ఇద్దరు సీఎం సహాయనిధి చెక్కులు పొందారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, ఏఎంసీ ఛైర్మన్ పాల సాయిరాం, సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డి, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.
- ఇదీ చదవండి : "కొవిడ్ సమయంలో లిక్కర్ ప్రజలకు టానిక్"