ETV Bharat / state

మత్స్యకారుల పెదాలపై చిరునవ్వులే మా లక్ష్యం: మంత్రి హరీశ్ - రంగనాయక్ సాగర్​ వార్తలు

మత్సకారుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్నీ చెరువుల్లో చేపలను ఉచితంగా పంపిణీ చేస్తుందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రంగానాయక్​ సాగర్​లో ఆయన చేపపిల్లలను విడుదల చేశారు.

minister-harish-rao-distribute-fishes-at-ranganayak-sagar-in-siddipet-district
మత్స్యకారుల పెదాలపై చిరునవ్వులే మా లక్ష్యం: మంత్రి హరీశ్
author img

By

Published : Dec 3, 2020, 4:53 PM IST

మత్స్యకారుల పెదాలపై చిరునవ్వులు చూడటమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్​లో మంత్రి చేప పిల్లలను విడుదల చేశారు. ఒక్క రంగనాయక్ సాగర్​లోనే ఇప్పటి వరకు 13 లక్షల 20 వేల చేప పిల్లలను విడుదల చేశామని పేర్కొన్నారు. చేప పిల్లలతో పాటు... మార్కెట్​లో అధిక డిమాండ్ ఉన్న రొయ్య పిల్లలను సైతం జలాశయాల్లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ద్వారా జిల్లాలో మత్స్య సంపద ఎంతో పెరిగిందని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్, జిల్లా అదనపు కలెక్టర్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు హాజరైన కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.