ETV Bharat / state

18 ప్రశ్నలకు జవాబివ్వాలంటూ బండి సంజయ్‌కు హరీశ్ లేఖ - దుబ్బాక ఉప ఎన్నిక తాజా వార్తలు

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపిస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. అసత్య ప్రచారాలతో భాజపా నేతలు ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

మీరు ఏ నైతికతతో ఓట్లు అడుగుతున్నారు: హరీశ్‌రావు

author img

By

Published : Nov 1, 2020, 10:28 AM IST

కేంద్రంలోని భాజపా అడుగడుగునా తెలంగాణకు అన్యాయం చేసిందని మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. పింఛన్ల విషయంలోనూ గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని... ప్రశ్నించిన వారిపై వ్యక్తిగత దాడికి పాల్పడుతున్నారని అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి 18 ప్రశ్నలు సంధిస్తూ హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. వాటికి సమాధానం చెప్పాలన్నారు.

పింఛన్లపై సవాలు చేస్తే ఇంతవరకూ స్పందించలేదని... 11 అంశాలతో ఛార్జిషీట్ వేస్తే ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదన్నారు. మిషన్‌ భగీరథ, కాకతీయలకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసినా... ఒక్క పైసా ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రంలోని ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మంత్రి హరీశ్‌రావు సమక్షంలో భాజపా సీనియర్‌ నేత తోట కమలాకర్‌రెడ్డి తెరాసలో చేరారు.

మీరు ఏ నైతికతతో ఓట్లు అడుగుతున్నారు: హరీశ్‌రావు

ఇదీ చూడండి: చివరి అంకానికి ప్రచారం... ఏర్పాట్లలో అధికార యంత్రాంగం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.