సిద్దిపేట కోమటి చెరువు కట్టపై సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం ప్రజలందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. హరీశ్ సతీమణి శ్రీనిత బతుకమ్మ సంబురాల్లో మహిళలతో కలిసి ఉత్సాహంగా ఆడి పాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు సద్దుల బతుకమ్మ పండుగను ఆడపడుచులు వైభవంగా జరుపుకోవడం గర్వంగా ఉందని మంత్రి హారీశ్ అన్నారు. సిద్దిపేట కోమటి చెరువు వద్ద ఆడపడుచులతో కలిసి కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొనడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి : ఆర్టీసీలో అద్దె బస్సులను పెంచే యోచనలో ప్రభుత్వం...!