సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వర్ధరాజ్ పూర్, సింగాటంలో వరి కొనుగోలు కేంద్రాలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. మర్కుక్ మండలం కరోనా కట్టడిలో ఆదర్శమని మంత్రి అన్నారు. అందుకు అధికారులు, ప్రజాప్రతినిధుల, ప్రజల సహకారం గొప్పదని అభినందించారు. వరి కొనుగోలుకు క్వింటాల్‌కు రూ. 1835 మద్దతు ధరను ప్రభుత్వం ఇస్తుందన్నారు. ప్రతీ రైతు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవాలని సూచించారు. అవసరం ఉన్న ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులను మొదలుపెట్టండని అధికారులను మంత్రి కోరారు.
కరోనా కోసం ఇన్ని రోజులు చేసిన కృషిని వృథా చేయొద్దని ఆయన అన్నారు. రైతు అకౌంట్లలో జమ చేసిన డబ్బులు మీ అకౌంట్ల నుంచి డబ్బులు పోతాయని సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దన్నారు. సీఎం సహాయనిధికి ఈనకొండ చంద్రారెడ్డి రూ. 5 లక్షల చెక్కును మంత్రికి అందజేశారు. జగదేవపూర్ మండలం జంగంరెడ్డి పల్లిలో అనాథలైన ఇద్దరు ఆడపిల్లకు లక్షా యాభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : బత్తిని పేరుతో నకిలీ మెడిసిన్..