సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో బుధవారం మధ్యాహ్నం జిల్లాలోని సిద్ధిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల పట్టణాల్లో వీధుల్లో తిరుగుతూ వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి 10 వేల చొప్పున చెక్కులను మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 5176 మందికి 5 కోట్ల 17 లక్షల 60 వేల రూపాయల జంబో చెక్కును మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ మేరకు సిద్ధిపేట పట్టణంలో 1020 మందికి 10 వేల రూపాయల చొప్పున.. మొత్తం ఒక కోటి ఇరవై లక్షల రూపాయల బ్యాంకు బుణాల చెక్కులను మంత్రి చేతుల మీదుగా అందించారు.
ప్రతీ రోజూ పొద్దున్నే లేచి చిరు వ్యాపారం చేసుకునే వ్యాపారులకు కరోనా రూపంలో కష్టకాలం వచ్చిందని, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీశ్‌రావు అన్నారు. వ్యాపారం దెబ్బతిందని.. ఆందోళన చెంది రంది పడొద్దని... మీకు మేమున్నామని మంత్రి హరీశ్ ధైర్యం చెప్పారు. చిరు వ్యాపారాల్లో మంత్రి ఆత్మ విశ్వాసం నింపి భరోసాను ఇచ్చారు. వ్యాపారులకు అండగా, వారి కాళ్లపై వారు నిలబడేలా సూక్ష్మ, చిన్న రుణ సదుపాయ కల్పన చేస్తున్నామని మంత్రి చెప్పారు.
ఇవీ చూడండి: అక్టోబర్ పదో నాటికి రైతువేదికలన్నింటినీ పూర్తి చేయాలి: సీఎస్