ETV Bharat / state

దుబ్బాక అభ్యర్థి సుజాతను కలిసిన మంత్రి హరీశ్​రావు

మంత్రి హరీశ్​రావు, ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్​, క్రాంతికిరణ్​ కలిసి దుబ్బాక ఉపఎన్నిక తెరాస అభ్యర్థి సుజాత రామలింగారెడ్డితో భేటీ అయ్యారు. దుబ్బాక ఉపఎన్నికల్లో సుజాతను గెలిపించి రామలింగారెడ్డి ఆశయాలను కొనసాగించాలని మంత్రి హరీశ్​రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

minister harish rao and p kotha prabharkar reddy visited trs candidate sujatha at dubbaka
దుబ్బాక అభ్యర్థి సుజాతను పరామర్శించిన మంత్రి హరీశ్​రావు
author img

By

Published : Oct 6, 2020, 2:25 PM IST

దుబ్బాక ఉపఎన్నిక తెరాస అభ్యర్థి సుజాత రామలింగారెడ్డిని మంత్రి హరీశ్​రావు, ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి, మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ ​రెడ్డి, ఆందోళ్​ ఎమ్మెల్యే క్రాంతికిరణ్​ కలిశారు. దుబ్బాక సిట్టింగ్​ ఎమ్మెల్యేగా పనిచేస్తూ రామలింగారెడ్డి మరణించగా ఆ స్థానంలో పార్టీ అభ్యర్థిగా ఆయన భార్య సుజాత పేరును పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. రామలింగారెడ్డి మృతిపై మంత్రి హరీశ్​రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2001లో పార్టీ ఆవిర్భావం నుంచి తెరాస అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేశారని గుర్తుచేసుకున్నారు.

రామలింగారెడ్డి వల్లే దుబ్బాకలో అభివృద్ధి జరిగిందన్నారు. అతి త్వరలో కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి దుబ్బాక ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు. రామలింగారెడ్డి ఆశయాలను సుజాత ద్వారా కొనసాగిస్తామని మంత్రి తెలిపారు. సుజాతకు ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డితో పాటు తాను అండగా నిలుస్తానని హరీశ్​రావు పేర్కొన్నారు. తనను గెలిపించి రామలింగారెడ్డి బదులు సేవ చేసేలా చూడాలని ఓటర్లకు సుజాత విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: దుబ్బాక తెరాస అభ్యర్థిని ఖరారు చేసిన సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.