ETV Bharat / state

'విద్యుత్​ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది తెరాసనే'

సిద్దిపేటలో నూతనంగా నిర్మించిన ట్రాన్స్​కో డివిజనల్​ ఇంజినీర్​ కార్యాలయ భవనాన్ని మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని విద్యుత్​ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు.

minister harish opened de office at siddipeta
'రానున్న రోజుల్లో ట్రాన్స్​కో సూపర్​విజన్​ చాలా అవసరం'
author img

By

Published : Jun 29, 2020, 4:11 PM IST

విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెరాస ప్రభుత్వం తెచ్చిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. సిద్ధిపేటలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన ట్రాన్స్ కో డివిజనల్ ఇంజినీర్ కార్యాలయ భవనాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి, స్థానిక కౌన్సిలర్, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.

ఒకప్పుడు కరెంటు అంటే సమస్యగా ఉండేదని.. ఇవాళ సౌకర్యంగా మారిందని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో ట్రాన్స్ కో సూపర్​విజన్ చాలా అవసరం ఉన్న దృష్ట్యా 220 కేవీ సిద్ధిపేట నుంచి, 440 కేవీ కొడకండ్ల నుంచి, సెకండ్ కనెక్షన్ కోసం రూ.40 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.

ఇవీ చూడండి: హోంమంత్రికి కరోనా.. వైద్యాధికారులు ఏమంటున్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.