ETV Bharat / state

కరోనాతో సహజీవనం చేయడం తప్పట్లేదు: మంత్రి హరీశ్​ - సిద్ధిపేట జిల్లా తాజా వార్త

సిద్దిపేట జిల్లా అంబేడ్కర్​ నగర్​లో నిరుపేదలకు మంత్రి హరీశ్​రావు నిత్యావసరాలను పంపిణీ చేశారు. అర్హులందరికీ రెండో విడత రూ. 1500 పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.

minister harish groceries distributions to poor the siddipeta
కరోనాతో సహజీవనం చేయడం తప్పట్లేదు: మంత్రి హరీశ్​
author img

By

Published : May 9, 2020, 1:48 PM IST

సిద్దిపేట అంబేడ్కర్​ నగర్‌లో మంత్రి హరీశ్‌రావు నిత్యావసరాలు పంపిణీ చేశారు. కరుణ క్రాంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1,400 మందికి పేదలకు సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. అర్హులందరికీ రెండో విడత రూ.1,500 చొప్పున పంపిణీ చేస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడించారు.

సిద్దిపేటలో ఇప్పటికే 12 వేల మందికి సాయం అందించామన్నారు. జిల్లా గ్రీన్​జోన్‌లో ఉన్నా నిర్లక్ష్యంగా ఉండొద్దని ఆయన ప్రజలకు సూచించారు. మాస్కు ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కరోనాతో సహజీవనం తప్పేటట్లు లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అందరి సహకారంతోనే కరోనాను ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు.

ఇవీ చదవండి...విశాఖ వాసులను వెంటాడుతున్న విషవాయువు...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.