ETV Bharat / state

ఉత్తమ్ మహిళలను గౌరవించడం నేర్చుకోండి: పద్మాదేవేందర్ రెడ్డి

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్ రెడ్డి మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. పుట్టెడు దుఃఖంలోనూ... భర్త ఆశయాల కోసం ప్రజల ముందుకు వస్తే... అవమానపరచడం సరైంది కాదన్నారు.

medak mla padmadevendar reddy fire on pcc president utham kumar reddy
ఉత్తమ్ మహిళలను గౌరవించడం నేర్చుకోవాలి: పద్మాదేవేందర్ రెడ్డి
author img

By

Published : Oct 10, 2020, 2:28 PM IST

medak mla padmadevendar reddy fire on pcc president utham kumar reddy
ఉత్తమ్ మహిళలను గౌరవించడం నేర్చుకోవాలి: పద్మాదేవేందర్ రెడ్డి

ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందు మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని ఆయనకు ఉన్న జ్ఞానం ఏంటో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి విమర్శించారు. భర్తను కోల్పోయి దుఃఖంలో ఉన్న సోలిపేట సుజాతకు తోబుట్టుల్లా... మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అండగా నిలుస్తుంటే... ఉత్తమ్ కుమార్ రెడ్డి అసమర్థురాలు అనడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.

దేశ ప్రధానిగా చేసిన ఇందిరాగాంధీ మహిళ అనే విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి మర్చిపోయినట్టున్నారని ఎద్దేవా చేశారు. ఆయన భార్య కూడా శాసనసభ్యురాలిగా పనిచేసిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జీఎస్టీలో రాష్ట్రానికి రావాల్సిన వాటాను చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంటే... దుబ్బాక ఉప ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని భాజపా నాయకులను విర్శించారు.

ఇదీ చూడండి: జక్కన్నకు 'భీమ్', 'సీతారామరాజు' స్పెషల్ విషెస్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.