ఇదీ చదవండి :వలసలతో టీపీసీసీకి వచ్చిన నష్టమేం లేదు: ఉత్తమ్
'మోదీపై తండ్రీ కొడుకులు విష ప్రచారం చేస్తున్నారు' - మెదక్ పార్లమెంట్ అభ్యర్థి
ఎన్నికల సమయంలో నేతల మధ్య విమర్శలు పెరుగుతున్నాయి. కేసీఆర్, కేటీఆర్‌పై మెదక్ జిల్లా భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తండ్రీ కొడుకులు కలిసి భాజపాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
భాజపా అభ్యర్థి
ప్రధాని నరేంద్ర మోదీపై కేసీఆర్ విష ప్రచారం చేస్తున్నారని మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. దేశం సురక్షితంగా ఉండాలంటే మోదీ లాంటి ప్రధాని అవసరమని సిద్దిపేటలో పేర్కొన్నారు. రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయించిన ప్రధాని అని గతంలో ప్రశంసించిన కేసీఆర్... ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు. 1999 తరువాత 2019లో మెదక్‌లో కచ్చితంగా భాజపా జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి :వలసలతో టీపీసీసీకి వచ్చిన నష్టమేం లేదు: ఉత్తమ్
రిపోర్టర్:పర్షరాములు
ఫైల్ నేమ్:TG_SRD_72_27_BJP PRESSMEET_SCRIPT_C4
సెంటర్:సిద్దిపేట జిల్లా సిద్దిపేట
యాంకర్: సిద్దిపేటలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న బిజెపి పార్టీ మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... ఈ ఎన్నికలు దేశ ప్రధానిని దేశ భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి తెలంగాణ ప్రజాలు గత ఎన్నికలలో ఎవరు ముఖ్యమంత్రి కావాలో ప్రజలు నిర్ణయించారు. దానిని మేము స్వాగతించాము. ఒకవైపు మోడీ అయితే మరొకవైపు కుటుంబ పాలన కుటుంబ సభ్యులు పోటీ పడుతున్నారు వారి ఆస్తులు కాపాడుకోవడానికి వారి కుటుంబ పాలన ప్రాంతీయ పార్టీలు అవసరమని రఘునందన్ రావు విమర్శించారు. ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే నరేంద్ర మోడీ లాంటి ప్రధాని అవసరం తెలంగాణ ప్రజలకు కు విజ్ఞప్తి చేస్తున్న కేసీఆర్ కేటీఆర్ మాట్లాడుతున్న అబద్ధ ప్రచారం నమ్మవద్దని తెలంగాణ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ ఎలాంటి పక్షపాతం లేకుండా కేంద్రం నుంచి కేంద్రం నుంచి అనేక అ నిధులు సమకూర్చడం జరిగింది ఆయన అన్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ కేంద్రీయ విద్యాలయాలు రైల్వే లైన్లు తెలంగాణను అభివృద్ధిలో నడిపించేమన్నారు. భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థులను కల్పించాలి అన్నారు. గెలిపిస్తే ఎలాంటి దళారులు టేకు దారులు కమీషన్ ఏజెంట్లు లేకుండా సీదా సీదా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ కి పోతుంది. టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారి ఆస్తులు అత్యధికం లో ఉన్నాయి.వారిని వెంటనే అలాంటి వాళ్ళను తిరస్కరించాలని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు డిమాండ్ చేశారు. కచ్చితంగా గా మెదక్ పార్లమెంటు లో బీజేపీ జెండా ఎగురవేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.
బైట్: రఘునందన్ రావు మెదక్ బిజెపి అభ్యర్థి