సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామానికి చెందిన కోమటిరెడ్డి కరుణాకర్ రెడ్డి.. మిత్రులతో కలిసి సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు చూసేందుకు వెళ్లారు. కరుణాకర్ రెడ్డి అందరూ చూస్తూ ఉండగా ఎగువ మానేరులో ఈతకొట్టేందుకు వెళ్లగా.. అలల తాకిడికి మానేరులో గల్లంతయ్యాడు. ఓ పక్క పోలీసులు కాపలా కాస్తున్నా సందర్శకులు మానేరులోకి దిగుతున్నారు.
విషయం తెలుసుకున్న గంభీరావుపేట పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని రాత్రి పొద్దుపోయే వరకు మానేరులో వెతికారు. ఇవాళ ఉదయం మరోసారి గాలించగా యువకుని శవం లభ్యమైంది. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి : శ్రీశైలం అగ్నిప్రమాదం ఘటనలో తొమ్మిది మంది మృతి