సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలంలోని మోతే గ్రామంలో మల్లేశం చిత్రబృందం పర్యటించింది. గ్రామంలోని దావత్ చంద్రయ్య, భూదవ్వ అనే వృద్ధ చేనేత దంపతులను కలిశారు. చేనేతకు ఉపయోగించే మగ్గాలను, ఆసు పోసే యంత్రాన్ని, చేనేతకు కావలసిన ఇతర పరికరాలను పరిశీలించారు.
రుమాలు గుడ్డ ఎక్కడ తయారు చేస్తారా అని ఏళ్ల నుంచి అనుకునేవాడినని... అదృష్టం కొద్దీ రుమాలు తయారు చేయడం ఇక్కడ చూసానని చింతకింది మల్లేశం అన్నారు. తాను చేసిన ఆసు యంత్రాన్ని కొద్ది మార్పులు చేసి ఉపయోగించుకుంటే, శ్రమ తగ్గుతుందని వారికి సూచించారు. మోతే గ్రామానికి రావడం ఒక చక్కని అనుభూతని చిత్ర నిర్మాత, దర్శకుడు ఆర్ రాజు అన్నారు. ఇది ఒక అనుభవం లాంటిదని.. ఇక్కడి చేనేత కార్మికులు వాడే విధానం ప్రత్యేకంగా ఉందని తెలిపారు.
ఇదీ చూడండి:గర్భవతిని చేసి.. మందుల చీటిపై వీలునామా రాసిన డాక్టర్