ETV Bharat / state

పోతారం(ఎస్​)లో కాళోజీ గ్రంథాలయం ఏర్పాటు

హుస్నాబాద్​ మండలం పోతారం(ఎస్​) గ్రామంలో కాళోజి గ్రంథాలయాన్ని యువ మిత్ర అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేశారు . ప్రారంభోత్సవ కార్యక్రమానికి హుస్నాబాద్​ ఎంపీపీ మానస, ఎంపీడీవో రాము, ప్రముఖ కవి అన్నవరం దేవేందర్​, గ్రామ సర్పంచి, గ్రామస్థులు హాజరయ్యారు.

పోతారం(ఎస్​)లో కాళోజి గ్రంథాలయం ఏర్పాటు
author img

By

Published : Oct 2, 2019, 11:34 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) గ్రామంలో 'యువ మిత్ర అసోసియేషన్' ఆధ్వర్యంలో కాళోజీ పేరిట ఏర్పాటు చేసిన గ్రంథాలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. హుస్నాబాద్ ఎంపీపీ మానస, ఎంపీడీవో రాము మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి గ్రంథాలయాన్ని ప్రారంభించారు. గ్రామానికి చెందిన పలువురు దాతల సహాయంతో ఈ గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. గ్రామ సర్పంచ్ బత్తిని సాయిలు తమ గృహాన్ని గ్రంథాలయ ఏర్పాటుకు దాతృత్వంగా ఇవ్వడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నవరం దేవేందర్ మాట్లాడుతూ ప్రపంచంలో గొప్ప నాయకులందరూ పుస్తకాలు చదివే ఆస్థాయికి ఎదిగారని తెలిపారు. గ్రంథాలయానికి కావాల్సిన పుస్తకాలను హైదరాబాద్ నుండి తెప్పిస్తానని అన్నారు.

ఇవీ చూడండి:

ప్రతి గ్రామానికి ఆదర్శం ఈ 'ప్రజా గ్రంథాలయం'

వారికి ఇల్లే ఓ గ్రంథాలయం... పుస్తకాలే నేస్తాలు..!

Intro:TG_KRN_104_02_GRANDHALAYAM_PRARAMBAM_AVB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) గ్రామంలో యువ మిత్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో కాళోజి పేరిట ఏర్పాటుచేసిన గ్రంథాలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. హుస్నాబాద్ ఎంపీపీ మానస, ఎంపీడీవో రాము గార్లు మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలువేసి గ్రంథాలయాన్ని ప్రారంభించారు. గ్రామానికి చెందిన పలువురు దాతల సహాయంతో ఈ గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామ సర్పంచ్ బత్తిని సాయిలు గారు తమ గృహాన్ని గ్రంధాలయ ఏర్పాటుకు దాతృత్వంగా ఇవ్వడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమనికి హాజరైన తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నవరం దేవేందర్ గారు మాట్లాడుతూ గ్రంథాలయానికి కావలసిన పుస్తకాలను హైదరాబాద్ నుండి తెప్పిస్తానని, పుస్తక పఠనం ద్వారానే మానవుని యొక్క జ్ఞానం వృద్ధి చెందుతుందని, పుస్తక పఠనం ద్వారానే కొంతమంది వ్యక్తులు తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొని గొప్ప వ్యక్తులుగా సమాజంలో గుర్తింపు పొందారని అన్నారు. నేడు మహాత్మాగాంధీ 150 వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించడం సంతోషకరమని, అదేవిధంగా కాళోజీ నారాయణరావు గారి పేరు పెట్టడం గొప్ప విషయమని నిర్వాహకులను అభినందించారు.

Body:బైట్

1) అన్నవరం దేవేందర్, తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు

Conclusion:హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్) గ్రామంలో కాళోజి గ్రంధాలయం ప్రారంభం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.