ETV Bharat / state

komuravelli mallanna kalyanam 2021 : కమనీయం.. కోరమీసాల మల్లన్న కల్యాణం.. - తెలంగాణ వార్తలు

komuravelli mallanna kalyanam 2021 : కోరమీసాల కొమురవెల్లి మలన్న కల్యాణం అంగరంగ వైభవంగా సాగింది. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలతో శోభాయమానంగా.... మల్లికార్జునిడి వివాహం జరిగింది. ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్‌రావు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మల్లన్న కల్యాణాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.

komuravelli mallanna kalyanam 2021, mallikarjuna swamy kalyanam
వైభవంగా కోరమీసాల మల్లన్న కల్యాణం
author img

By

Published : Dec 26, 2021, 12:20 PM IST

Updated : Dec 26, 2021, 2:36 PM IST

వైభవంగా కోరమీసాల మల్లన్న కల్యాణం

komuravelli mallanna kalyanam 2021 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో మూడు నెలల పాటు జరిగే మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు... మల్లన్న కల్యాణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. కల్యాణోత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున దిష్టి కుంభం కార్యక్రమాన్ని నిర్వహించారు. వీర‌శైవ ఆగ‌మ విధానంలో 200 కిలోల బియ్యంతో వండిన అన్నాన్ని.... మ‌హా మండ‌పంలో దిష్టికుంభం నిర్వహించారు. అనంతరం... వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం మల్లికార్జున స్వామి..... బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలను వివాహమాడారు. వధువుల తరఫున మహాదేవుని వంశస్థులు కన్యాదానం చేయగా.. వరుడి తరుపున పడిగన్నగారి వంశస్థులు కన్యాదానం స్వీకరించారు. మహారాష్ట్ర బృహన్మఠాదీశుడు సిద్ధగురు మణికంఠ శివాచార్యుల పర్యవేక్షణలో స్వామి వారి కల్యాణం జరిగింది.

తరలివచ్చిన భక్తులు

రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి హరీశ్‌రావు.... స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, వివిధ ప్రాంతాల వేలాదిగా భక్తులు తరలివచ్చారు. మల్లన్న ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రంగా భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులు కరోనా జాగ్రత్తలు పాటించేలా ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయ పరిసరాల్లో 4 చోట్ల వాహనాల పార్కింగ్‌, 4 చోట్ల స్నాన ఘట్టాలు సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా... భారీగా పోలీసులు మొహరించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్... కొమురవెల్లి మల్లన్న పేరుమీదనే రాష్ట్రంలోనే అతిపెద్ద రిజర్వాయర్​ను రూపొందించారు. మల్లన్న స్వామి ఆశీస్సులతో మొన్ననే 50 టీఎంసీల ప్రాజెక్టు పూర్తై... మొన్ననే 10 టీఎంసీల నీటిని నింపుకున్నాం. అంతా ఆ మల్లన్న దేవుడి దయ. తెరాస ప్రభుత్వ వచ్చాక ఈ ఆలయం అభివృద్ధి జరుగుతోంది. ఏడేళ్లలో దాదాపు రూ.30కోట్లతో అభివృద్ధి పనులు చేసుకున్నాం. మల్లన్న దేవుడు అంటేనే పాడి, పంటకు యజమాని. పాడిపంటను సల్లగా చూసే దేవుడు. ఈ కేంద్రప్రభుత్వానికి జ్ఞానోదయమై... రైతులను మంచిగా చూడాలని ఆ మల్లన్నను ప్రార్థిస్తున్నాను.

-హరీశ్ రావు, మంత్రి

వైభవంగా కోరమీసాల మల్లన్న కల్యాణం

వైభవంగా వేడుకలు

మల్లన్న కల్యాణ వేడుకల్లో భాగంగా.... ఇవాళ సాయంత్రం 7 గంటలకు స్వామివారి రథోత్సవం జరగనుంది. రేపు ఉదయం 9 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకు లక్షబిల్వార్చన, మహా మంగళహారతి కార్యక్రమాలు జరగనున్నాయి.

ఇదీ చదవండి: Fog at Yadadri Temple : యాదాద్రి ఆలయ పరిసరాలను కప్పేసిన పొగమంచు

Last Updated : Dec 26, 2021, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.