ETV Bharat / state

ఆద్యంతం కోలాహలమే.. కొమురవెల్లి జాతర

కొమురవెల్లి మల్లన్న జాతర కన్నులపండువగా సాగుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. రెండో వారం భక్తులు భారీగా తరలివచ్చి కోరమీసాల స్వామివారిని దర్శించుకుంటున్నారు.

komuravelli mallanna bramhosthavalu second week
ఆద్యంతం కోలాహలమే.. కొమురవెల్లి జాతర
author img

By

Published : Jan 24, 2021, 2:11 PM IST

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న జాతర ఆద్యంతం కోలాహలంగా జరుగుతోంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని.. రెండో వారం కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. కోరమీసాల స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటున్నారు.

భక్తులు నెత్తిన బోనాలు ఎత్తుకుని డోలు చప్పుళ్ల మధ్య ప్రదక్షిణలు చేస్తూ స్వామికి నైవేద్యాలు సమర్పించుకుంటున్నారు. శివసత్తుల పూనకాల నడుమ.. శరణు మల్లన్న అంటూ భక్తులు చేస్తున్న నామస్మరణలు ఆలయ పరిసరాల్లో మారుమోగుతున్నాయి.

ఆలయ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా భక్తులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.

ఇదీ చదవండి: పెట్రో ధరలపై మోదీకి రాహుల్​ పంచ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.