మూడు నెలల పాటు సాగే కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత నిరాడంబరంగా ముగిశాయి. సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం నాడు ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు.. ఉగాది ముందు వచ్చే ఆదివారం రాత్రి నిర్వహించే అగ్ని గుండాలతో ముగుస్తాయి.
సాధారణంగా ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. భక్తజనం దిక్కులు పిక్కటిల్లేలా చేసే మల్లన్న నామస్మరణల నడుమ జరగాల్సిన అగ్ని గుండాల తంతు.. కరోనా ప్రభావం.. ప్రభుత్వ నిషేధాజ్ఞలతో కేవలం అర్చకులు, ఆలయ సిబ్బంది మధ్యే జరిగింది. కరోనా తగ్గుముఖం పట్టాలని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీ చూడండి : రైతు బజార్లు కిటకిట... ధరలు భగభగ