సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఓ మహిళ నిస్సహాయ స్థితిలో కనపడింది. విషయం గుర్తించిన పోలీసులు ఆమెను ఆరా తీశారు. తన పేరు సార్ల చంద్రకళ అని తాము హైదరాబాద్లో ఉంటున్నట్లు పోలీసులకు తెలిపింది. కోహెడ మండల కేంద్రంలో ఉన్న తన బంధువుల ఇంటికి వచ్చానని, కానీ వారు అక్కడ లేకపోవడం వల్ల హైదరాబాద్ వెళ్లేందుకు తిరుగు ప్రయాణమైనట్లు చెప్పింది.
కానీ లాక్డౌన్ కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చినట్లు చంద్రకళ పోలీసులకు వివరించింది. మానవతా హృదయంతో స్పందించిన కోహెడ ఏఎస్ఐ పవన్ కుమార్, కానిస్టేబుళ్లు రమేష్, నరేష్, స్వరూపలు ఆమెకు సాయంగా నిలిచారు. చంద్రకళను సిద్దిపేట వరకు తమ వాహనంలోనే తీసుకెళ్లి హైదరాబాద్ వెళ్లే బస్సు ఎక్కించారు. పోలీసులు చేసిన సాయానికి చంద్రకళ ధన్యవాదాలు తెలిపింది.
ఇదీ చదవండి : ఆనందయ్య మందు.. కోటయ్య మృతి