సిద్దిపేట జిల్లా చింతమడక పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాదయాత్ర చేశారు. గ్రామంలో కలియతిరుగుతూ చిన్ననాటి మిత్రుల్ని.. గ్రామస్థులను పేరుపేరునా పలకరించారు. సీఎంతో పాటు హరీశ్‌రావు పలువురు నేతలు ఉన్నారు. పాదయాత్ర మధ్యలో ముఖ్యమంత్రితో స్వీయ చిత్రాలు తీసుకునేందుకు యువత పోటీపడ్డారు. స్థానిక ఆలయాల్లో ముఖ్యమంత్రి పూజలు చేశారు. ప్రతి ఇంటి వద్ద ఆగి అందరినీ పలకరించారు. గ్రామస్థుల యోగక్షేమాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. సీఎంతో కరచాలనానికి స్థానికులు ఎగబడ్డారు. పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.
ఇవీ చూడండి: చింతమడక అభివృద్ధికి రూ 200 కోట్లు: కేసీఆర్