ETV Bharat / state

Harish Rao on Monsoon Crops in TS : 'రైతులు.. వానాకాలం పంటను ముందుకు జరపాలి' - సిద్ధిపేటలో హరీశ్‌రావు పర్యటన

Harish Rao on Monsoon Crops in Telangana : రైతులు వానాకాలంలో పండించే పంటను నెల రోజుల ముందుకు జరపాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ వల్ల రైతులకు విలువ పెరిగిందని తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.

harishrao
harishrao
author img

By

Published : May 20, 2023, 4:51 PM IST

Harish Rao on Monsoon Crops in Telangana : దేశానికే ఆదర్శంగా తెలంగాణ మారిందని.. సీఎం కేసీఆర్‌ రైతుకు విలువ పెంచారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. సంక్షేమంలోనైనా.. అభివృద్ధిలోనైనా సిద్ధిపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లామని ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం భాషాయిగూడెం-తిమ్మాయిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

వానాకాల పంటను నెల ముందుకు జరపండి..: అకాల వర్షాలు, వడగళ్ల వానలతో చేతికొచ్చే పంట నష్టపోతుందని, వానాకాలం పంట నెల ముందుకు జరపాలని రైతులకు హితవు పలికారు. గ్రామంలో ప్రతి వీధికి సీసీ రోడ్లు, ఇంటింటికీ మిషన్‌ భగీరథ ద్వారా తాగు నీరు, కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు ఉండేవని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో సీఎం కేసీఆర్‌ లేకపోతే.. తెలంగాణ రాకపోతే.. 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతు బీమా, ఆసరా ఫించన్లు ఉండేవి కాదన్నారు. అలాగే రైతు పండించిన ధాన్యం ఒక్క గింజ లేకుండా ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పుకొచ్చారు.

పామాయిల్‌ తోటలకు ప్రాధాన్యం ఇవ్వాలి..: ఇప్పటి వరకు ఈ గ్రామం నుంచి దాదాపు 28 లారీల ధాన్యం వెళ్లిందని మంత్రి వెల్లడించారు. పామాయిల్‌ తోటలు విరివిగా సాగు చేయాలని.. ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ అందిస్తోందన్నారు. రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పామాయిల్‌ తోటల పెంపకానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యాసంగిలో వరికి తెగులు వస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్న దృష్ట్యా.. రసాయనిక ఎరువులు తగ్గించి.. పంట మార్పిడి చేస్తే ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న జనుము, జీలుగు, పచ్చిరొట్టె విత్తనాలు తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని రైతులను మంత్రి హరీశ్‌ రావు కోరారు.

"రాష్ట్రం ఏర్పడక ముందు అన్ని రంగాల్లోనూ తెలంగాణ వెనకబాటు తనానికి గురైంది. అదే రాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్‌ వల్ల రైతుల విలువ పెరిగింది. ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు అందుతోంది. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు అందుతున్నాయి. అలాగే రైతులు వానాకాల పంటకాలాన్ని ముందుకు జరపాలి." -హరీశ్‌ రావు, మంత్రి

కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యిండు.. రైతులకు విలువ పెంచుండు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.