ETV Bharat / state

'మహాత్ముడి చరిత్రను రాబోయే తరాలకు అందిస్తాం'

మహాత్మా గాంధీ చరిత్రను కనుమరుగు చేసి నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్​ గాంధీల చరిత్రను తెరపైకి తేవడానికి కాంగ్రెస్​ పార్టీ ప్రయత్నిస్తోందని కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ ఆరోపించారు.

హుస్నాబాద్​లో గాంధీ సంకల్ప యాత్ర
author img

By

Published : Oct 28, 2019, 4:40 PM IST

హుస్నాబాద్​లో గాంధీ సంకల్ప యాత్ర

భాజపా ఆధ్వర్యంలో చేపట్టిన గాంధీ సంకల్ప యాత్ర సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​కు చేరుకుంది. మహాత్ముడి చరిత్రను రాబోయే తరాలకు అందించడానికే ఈ యాత్ర చేపట్టినట్లు కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ తెలిపారు. 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులనే గ్రామపంచాయతీలకు కేటాయిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే కార్మికుల డిమాండ్​కు భాజపా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

హుస్నాబాద్​లో గాంధీ సంకల్ప యాత్ర

భాజపా ఆధ్వర్యంలో చేపట్టిన గాంధీ సంకల్ప యాత్ర సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​కు చేరుకుంది. మహాత్ముడి చరిత్రను రాబోయే తరాలకు అందించడానికే ఈ యాత్ర చేపట్టినట్లు కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ తెలిపారు. 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులనే గ్రామపంచాయతీలకు కేటాయిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే కార్మికుల డిమాండ్​కు భాజపా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

Intro:TG_KRN_101_28_MP BANDI_PC ON KCR_AB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన గాంధీ సంకల్ప యాత్ర చేరుకుంది. హుస్నాబాద్ ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ చరిత్రను కనుమరుగు చేసి నెహ్రు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలా చరిత్రను తెరపైకి తేవడానికి ప్రయత్నం చేసిందని, గాంధీ చరిత్రను రాబోయే తరాలకు అందించడానికి ఈ గాంధీ సంకల్ప యాత్రను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్నామని అన్నారు. గ్రామ పంచాయతీల పరిస్థితి అద్వానంగా ఉందని, గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు గ్రామాలలో తల ఎత్తుకునే పరిస్థితి లేదని 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులనే గ్రామపంచాయతీలకు కేటాయిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా గ్రామపంచాయతీలకు కేటాయించలేదని, వెంటనే కేటాయించిన నిధులుపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలుపే గెలుపు అనుకుంటే మిగతా 119 స్థానాల్లో ఎమ్మెల్యేల, మంత్రుల గెలుపు గెలుపు కాదా, మొత్తం రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారని, తమ నియోజకవర్గాలకు నిధులు రావాలంటే మళ్లీ ఉప ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ కు బీజేపీ మద్దతు ఇస్తుందని అన్నారు. కేవలం ఆర్టీసీని ప్రవేట్ పరం చేయడానికే కేసీఆర్ రహస్య ఒప్పందం చేసుకున్నారని అన్నారు. అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి నష్టపరిహారం అందేలా చూడాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకం రాష్ట్రంలో వర్తింపజేసి ఉంటే రైతులపై ఆర్థిక భారం తగ్గేదని, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, వేలకొలది వినతిపత్రాలు తనకు సమర్పిస్తున్నారని, ఇతర పార్టీలకు గడిచిన ఎన్నికల్లో హుస్నాబాద్ లో అవకాశం ఇచ్చినట్టే ఈ సారి జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపికి అధికారం కల్పిస్తే ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు.


Body:బైట్

1) కరీంనగర్ ఎంపీ బండి సంజయ్


Conclusion:హుస్నాబాద్ కు చేరుకున్న గాంధీ సంకల్ప యాత్ర ఎంపీ మీడియా సమావేశం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.