ప్రతి గ్రామానికి నర్సరీలు ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా... దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పురపాలికలో ఏర్పాటు చేసిన కల్పకవనం అర్బన్ పార్కును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తుచేశారు. 270 ఎకరాల్లో ఈ అర్బన్ పార్కును ఏర్పాటు చేశామని వెల్లడించారు. భవిష్యత్ తరాల కోసం ఆలోచన చేసి... ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కల పెంపకానికి కృషి చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.
రాష్ట్రంలో 4 శాతం అడవుల పునరుద్ధరణ చేశామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సీఎం కృషి వల్లనే 230 కోట్ల మొక్కలు నాటి 70 శాతం వాటిని సంరక్షించామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'ఏరోఇండియా'షోలో అబ్బురపరిచే గగన విన్యాసాలు