సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించేందుకు కళాకారులు తమవంతు పాత్ర పోషిస్తున్నారు. వాహన దారులకు బాధ్యతలను గుర్తుచేస్తూ వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు.
పట్టణానికి చెందిన కళాకారుడు వెంకటేశం కరోనా భూతం వేషధారణలో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారికి అవగాహన కల్పిస్తున్నాడు. పోలీసులు, డాక్టర్లు చేస్తున్న సేవకు తోడుగా తన వంతు బాధ్యతగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని వెంకటేశం తెలిపాడు.
ఇవీ చూడండి: క్వారంటైన్‌కు కొత్త రూల్- గంటకో సెల్ఫీ తప్పనిసరి!