ETV Bharat / state

కుడి చెరువు పరిధిలోని అక్రమ నిర్మాణాలు కూల్చివేత

సిద్దిపేట జిల్లా చేర్యాల కుడి చెరువు పూర్తి నిల్వ సామర్థ్య స్థలం(ఎఫ్​టీఎల్​)​ పరిధిలోని అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండడానికి పోలీసులు అధిక సంఖ్యలో మోహరించారు.

illegal constructions demolished in siddipet cheryala
చేర్యాల కుడి చెరువు పరిధిలోని అక్రమ నిర్మాణాలు కూల్చివేత
author img

By

Published : Mar 3, 2020, 11:12 AM IST

సిద్దిపేట జిల్లా చేర్యాల పురపాలక సంఘం పరిధిలోని అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. పట్టణ ప్రగతిలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పట్టణంలో పర్యటించారు. కుడి చెరువు ఎఫ్​టీఎల్​ పరిధిలో ఇళ్ల నిర్మాణాలు జరుగుతుండటం గమనించిన ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించకపోతే.. సస్పెండ్ చేస్తానని అధికారులను హెచ్చరించారు. దీనితో.. చేర్యాల పురపాలక సంఘం అధికారులు ఈరోజు ఉదయం చెరువు పరిధిలో నిర్మిస్తున్న ఇళ్లను తొలగించారు. శాంతి భద్రతల సమస్య రాకుండా అధిక సంఖ్యలో పోలీసులను మోహరించారు.

చేర్యాల కుడి చెరువు పరిధిలోని అక్రమ నిర్మాణాలు కూల్చివేత

ఇవీ చూడండి: హైదరాబాద్‌లో కరోనా కేసు... రేపు మంత్రుల ఉన్నతస్థాయి సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.