ETV Bharat / state

Groceries distribution: కరోనా మృతుల కుటుంబాలకు నిత్యావసర సరకుల పంపిణీ - సిద్దిపేట జిల్లాలో కరోనా బాధితులకు నిత్యావసర సరుకుల అందజేత

కరోనా కారణంగా మృతి చెందిన కుటుంబాలకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్​ గూడ అనూష నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ప్రజలందరూ కరోనా నిబంధనలను పాటించాలని సూచించారు.

daily commodities distributed to corona victims in siddipeta
కరోనా మృతుల కుటుంబాలకు నిత్యావసర సరకుల పంపిణీ
author img

By

Published : Jun 11, 2021, 2:59 PM IST

Updated : Jun 11, 2021, 3:25 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఆవరణలో.. కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాలకు హుస్నాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్​ గూడ అనూష నిత్యావసర సరుకులను అందజేశారు. మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆమె తెలిపారు.

కరోనా కారణంగా చిన్నాభిన్నమైన కుటుంబాలను సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని​ గూడ అనూష అన్నారు. బాధితులందరూ ధైర్యంగా ఉండి... సరైన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కరోనాను ఎదుర్కోవచ్చని ఆమె పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో తప్ప ప్రజలెవరూ బయటకు రాకూడదని... ఒకవేళ వచ్చినా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి: MURDER: చెల్లితో అసభ్య ప్రవర్తన.. రోకలిబండతో చంపిన సోదరి

Last Updated : Jun 11, 2021, 3:25 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.