ETV Bharat / state

రైతు బంద్​కు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యే సతీశ్​ కుమార్ - husnabad latest news

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో తెరాస శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే సతీశ్​ కుమార్ నిరసన తెలిపారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కార్యకర్తలతో కలిసి ర్యాలీ చేపట్టారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు.

'రైతులను రోడ్డున పడేసే చట్టాలను వెంటనే రద్దు చేయాలి'

author img

By

Published : Dec 8, 2020, 8:30 PM IST

భారత్ బంద్​కు మద్దతుగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో తెరాస శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే సతీశ్​ కుమార్ ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కార్యకర్తలతో కలిసి ర్యాలీ చేపట్టారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు.

'రైతులను రోడ్డున పడేసే చట్టాలను వెంటనే రద్దు చేయాలి'
'రైతులను రోడ్డున పడేసే చట్టాలను వెంటనే రద్దు చేయాలి'

రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తే... కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలతో అన్నదాతలను రోడ్డున పడేసే పరిస్థితి తీసుకొస్తోందని మండిపడ్డారు. రైతుల సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసే విధంగా వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఆరోపించారు. వెంటనే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయకుంటే... రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జడ్పీ ఛైర్మన్ సుధీర్ కుమార్, సిద్దిపేట జడ్పీ వైస్ ఛైర్మన్ రాజారెడ్డి, కరీంనగర్ జడ్పీ వైస్ ఛైర్మన్ గోపాలరావు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కొత్త మండలంగా దూల్​మిట్ట... తుది ప్రకటన విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.