సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ డివిజనల్ ఇంజినీరంగ్ విద్యుత్ శాఖ కార్యాలయం ముందు భాజపా నేతలు ధర్నా నిర్వహించారు. భాజపా రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు లాక్డౌన్ సమయంలో వచ్చిన విద్యుత్ బిల్లులు రద్దు చేసి, యూనిట్ బిల్లులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం హుస్నాబాద్ డివిజనల్ ఇంజినీరింగ్ అధికారికి వినతి పత్రం సమర్పించారు.
లాక్డౌన్ కారణంగా మూడు నెలల బిల్లు ఒకేసారి వేయడం వల్ల స్లాబ్ రేటు మారి.. విద్యుత్ బిల్లులు విపరీతంగా వచ్చాయి. లాక్డౌన్ వల్ల ఉపాధి లేక ప్రజలు ఇబ్బంది పడుతూ.. దాతలు పంచిన సరుకులతో ప్రజలు పూట గడుపుతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మూడు నెలల బిల్లు ఒకేసారి కట్టడం ఎంత ఇబ్బందో అధికారులు, ప్రజలు ఆలోచించాలని నేతలు హితవు పలికారు. విద్యుత్ బిల్లులు తగ్గించకపోతే.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.
ఇదీ చూడండి : కరీంనగర్ కమిషనరేట్లో లైసెన్సు రద్దు సెంచరీ దాటేసింది!