ETV Bharat / state

'అధిక విద్యుత్‌ చార్జీలు తెరాస వైఫల్యమే' - విద్యుత్​ బాకాయిలను రద్దు చేయాలి: భాజపా నేత రఘునందన్ రావు

అధిక విద్యుత్ చార్జీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ..సిద్ధిపేట జిల్లా ఎస్ఈ కరుణాకర్ బాబుకు భాజపా ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. లాక్‌డౌన్​లో విధించిన మూడు నెలల విద్యుత్​ బాకాయిలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భాజపా నేత రఘునందన్ రావు కోరారు.

'High electricity charges are a TRS failure'
'అధిక విద్యుత్‌ చార్జీలు తెరాస వైఫల్యమే'
author img

By

Published : Jun 11, 2020, 2:27 PM IST

లాక్​డౌన్​ కారణంగా ఉపాధిలేక అవస్థలు పడుతున్న కార్మికులకు.. విద్యుత్​ ఛార్జీల రూపంలో తెరాస ప్రభుత్వం పెను భారం మోపిందని సిద్ధిపేట భాజపా నేతలు ఆరోపించారు. అధిక విద్యుత్ చార్జీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఎస్.ఈ కరుణాకర్ బాబుకు భాజపా సిద్ధిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

లాక్‌డౌన్​లోని మూడు నెలల విద్యుత్​ బాకాయిలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భాజపా నేత రఘునందన్ రావు కోరారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది కానీ.. పేద ప్రజలపై అధిక భారం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలను దోచుకునే విధంగా కేసీఆర్​ సర్కార్​ ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డితో పాటు స్థానిక భాజపా నేతలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: జూడాల సమ్మె కొనసాగింపు.. సూపరింటెండెంట్​కు లేఖ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.