ETV Bharat / state

Husnabad: హుస్నాబాద్​లో చేపల మార్కెట్​ వద్ద జనాల రద్దీ - మిరుగు సందర్భంగా చేపల కొనుగోళ్లు

మృగశిర కార్తె సందర్భంగా చేపల మార్కెట్ల వద్ద జనాలు పోటెత్తారు. మిరుగు రోజున చేపలు తింటే అనారోగ్య సమస్యలు దరిచేరవన్న నమ్మకంతో మీనాల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో మార్కెట్లకు వచ్చారు.

heavy rush at fish markets in husnabad on the occasion of mrugashira karte
హుస్నాబాద్​లో చేపల మార్కెట్ వద్ద జనాల రద్దీ
author img

By

Published : Jun 8, 2021, 4:54 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని చేపల మార్కెట్లలో రద్దీ నెలకొంది. మృగశిర కార్తె సందర్భంగా చేపల విక్రయ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు కొనుగోళ్లు చేశారు. మృగ‌శిర కార్తె రోజున మీనాలు తింటే అనారోగ్య సమస్యలు రావన్న కార‌ణంతో ఎక్కువ మంది ఇవాళ చేపల కొనుగోళ్ల‌కు వ‌చ్చారు.

చేపల మార్కెట్ల వద్ద ప్రజలు మాస్కులు ధరిస్తున్నా... భౌతిక దూరం నిబంధన మాత్రం పాటించడంలేదు. చేపల కోసం పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించ‌క‌పోవ‌డం వల్ల వైరస్​ వ్యాప్తి చెంద‌డానికి ఆస్కారం ఉంద‌ని ప‌లువురు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: PRC: ఉద్యోగులకు గుడ్​న్యూస్​... అమల్లోకి రానున్న పీఆర్‌సీ!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.