సిద్దిపేట జిల్లాలో ఉదయం నుంచి వాతావరణం అంతా చల్లబడింది. ఒక్కసారిగా ఆకాశం మేఘామృతమై ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్ మండలాలలో భారీ వర్షం పడింది.
ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి వాహనదారులు ఎక్కడికక్కడే తమ వాహనాలను నిలిపి దుకాణ సముదాయాల వద్దకు చేరారు. గాలులతో కూడిన వర్షం కురవడం వల్ల వాతావరణమంతా చల్లబడి ఆహ్లాదంగా మారింది. పలు మండలాల్లో అక్కడక్కడా చెట్లు విరిగిపడి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లి, రోడ్లపై నీళ్లు నిలిచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇవీ చూడండి: కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!