సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట, కొహెడ మండలాల్లో ఇవాళ సాయంత్రం గంటపాటు భారీ వర్షం కురిసింది. నాలుగైదు రోజులుగా ఎండల తీవ్రతతో ఉక్కపోతకు గురవుతున్న హుస్నాబాద్ ప్రజలు ఉపశమనం పొందారు.
భారీ వర్షంతో హుస్నాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, సిద్దిపేట- వరంగల్ ప్రధాన రహదారి జలమయమయ్యాయి. ఫలితంగా వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. లోతట్టు ప్రాంతాల్లోని దుకాణాల్లోకి వరద నీరు ప్రవేశించి.. వ్యాపారులు అవస్థలు పడ్డారు.
ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి.. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు.