సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. రాఘవేంద్ర నగర్, సీతారాంనగర్, నాసర్ పురా, ఖాదర్ పురా, మహాశక్తి నగర్ కాలనీల్లో రూ.2.50కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సిద్దిపేట పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు యూజీడీ-అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిధుల కింద రూ.22 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు.
కాలనీ మహిళలతో స్వచ్ఛత విధానాలపై మాట్లాడారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా వేసి మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ నిషేధించాలని...పర్యావరణ పరిరక్షణకు నాటిన చెట్లు సంరక్షించాలని సూచించారు. మంత్రి వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, ఆయా వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: గిరిజన పిల్లలకు వైద్య పరీక్షలు చేసిన ఎస్పీ