రేపు సిద్దిపేటలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు అధికారులతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రగతి పనుల ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమావేశాన్ని నిర్వహించారు. మహతి ఆడిటోరియాన్ని సందర్శించి సభా ప్రాంతాన్ని పరిశీలించారు. సాంస్కృతిక కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.
కేసీఆర్ 6 కార్యక్రమాల్లో పాల్గొంటారని... ఒక్కొక్క కార్యక్రమం వద్ద జిల్లాస్థాయి అధికారి పర్యవేక్షించాలని సూచించారు. పాసులు ఉన్న వారికే అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వో ఈ సమావేశంలో పాల్గొన్నారు.