దుబ్బాకలో భాజపా అసత్యాలను ప్రచారం చేస్తోందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక.. రెడ్డి సంక్షేమ భవన్లో ఎమ్మార్పీఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. షబ్బీర్ అలీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో తమకు ఎంతో అనుబంధం ఉందని.. నాడు ఉద్యమంలో చేదోడు వాదోడుగా ఉన్నామని గుర్తు చేసుకున్నారు. తెరాస ప్రభుత్వం వచ్చాక వర్గీకరణకు మద్దతు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం పెట్టి.. కేంద్రానికి పంపితే ఎలాంటి స్పందన లేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణపై పూర్తి స్పష్టతతో ఉందని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో సింహంలాగా గర్జించిన ఘనత ఎమ్మార్పీఎస్ది అని కొనియాడారు. కాంగ్రెస్, భాజపాలు ఇదివరకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఇకముందు చేసేదేమి లేదని అన్నారు. మిరుదొడ్డిలో భాజపా కార్యకర్త చనిపోతే కనీసం పట్టించుకోలేదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో 230 సంక్షేమ పాఠశాలలను ప్రారంభించారని వెల్లడించారు. ఏక కాలంలో 30 మహిళా ఎస్సీ డిగ్రీ కళాశాలలు ప్రారంభించారని అన్నారు.
ఇదీ చదవండి: ఓడిపోతామనే భావనతోనే డబ్బుల డ్రామా ఆడుతున్నారు:హరీష్ రావు