ETV Bharat / state

Harish Rao on Siddipet IT Tower : 'సిద్దిపేటకు ఐటీ టవర్ తీసుకురావాలన్న నా కల.. ఇవాళ కళ్లేదుట కనబడుతోంది' - హరీశ్‌రావు తాజా కామెంట్స్

Harish Rao on Siddipet IT Tower : ప్రజల ఆకాంక్షలు అమలు చేస్తుంటే ఒక ప్రజాప్రతినిధికి మరింత శక్తి వస్తుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేటకు ఐటీ టవర్ తీసుకురావాలన్న తన కల.. ఇవాళ కళ్లేదుట కనబడుతోందని హర్షం వ్యక్తం చేశారు. సిద్ధపేట జిల్లా ఐటీ టవర్‌లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఐటీ హబ్ వెబ్ సైట్‌ను మంత్రి ప్రారంభించారు.

Siddipet IT Hub Website
Harish Rao on Siddipet IT Tower
author img

By

Published : Aug 15, 2023, 8:17 PM IST

Harish Rao on Siddipet IT Tower : సిద్ధిపేటలో సొంతంగా ఐటీ టవర్ పెట్టాలని అనుకునే వారికి కావాల్సిన మౌళిక సదుపాయాలతో పాటు అనువైన స్థలాన్ని ఇస్తామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఐటీ, పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. సిద్దిపేటలో జిల్లాలో పర్యటించిన హరీశ్‌రావు.. ఐటీ హబ్ వెబ్ సైట్‌ను (Siddipet IT Hub Website) ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సిద్దిపేట ఐటీ టవర్ ద్వారా 1500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

KTR To Inaugurate Nizamabad IT Hub : నిజామాబాద్​లో​ ఐటీ టవర్​ను ప్రారంభించిన కేటీఆర్.. నిరుద్యోగులకు హామీ​

Harish Rao Siddipet tour : ఫేజ్-1 పూర్తికాగానే.. ఫేజ్-2 ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. డిగ్రీ చివరి సంవత్సర విద్యార్థులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా.. ఇటీవల 7 కంపెనీలు నిర్వహించిన జాబ్ మేళాలో ఎంపికైన వారికి ఆఫర్ లెటర్స్ (Job offer letters) అందించారు. ప్రస్తుతం 18 కంపెనీలకు ఎంపికైన అభ్యర్థులకు టాస్క్ ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ అక్టోబర్‌ నాటికి 1000 ఉద్యోగులు ఐటీ టవర్‌లో ఉద్యోగులుగా ఉంటారని మంత్రి వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీశ్, ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Jagadish Reddy Visits Komati Cheruvu : 'హరీశ్ అన్నా.. కోమటి చెరువు అందం అదిరింది.. సిద్దిపేట భలే సుందరంగా ఉంది'

Harish Rao on Rythu Bima : రైతుబీమా పథకం నేటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేసిన హరీశ్‌రావు.. రైతుల గురించే కాదు, రైతుల కుటుంబాల గురించి కూడా ఆలోచించే మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని కొనియాడారు. ఏ కారణంతో రైతు చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలన్న సంకల్పంతో 2018 ఆగస్టు 15న రైతుబీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు.

రైతుబీమా ప్రారంభించిన తొలి ఏడాది 2018-19 సంవత్సరంలో 31.25 లక్షల మంది రైతులు తమ పేరు నమోదు చేసుకోగా.. 2023-24 నాటికి ఆ సంఖ్య 41.04 లక్షలకు పెరిగినట్లు మంత్రి వివరించారు. 2018లో రూ. 602 కోట్ల రూపాయలు ప్రీమియంగా (Farmer Insurance Premium) చెల్లించగా.. ఇవాళ రూ.1,477 కోట్లు ప్రీమియంగా చెల్లిస్తున్నట్లు తెలిపారు. రైతుబీమా కోసం ఇప్పటి వరకు రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వం 6861 కోట్లు ప్రీమియం కింద చెల్లించగా.. వివిధ కారణాలతో మరణించిన రైతు కుటుంబాలకు రూ. 5,402 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు హరీశ్ రావు తెలిపారు.

  • ఏ కారణంతో రైతు చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు 2018 ఆగస్టు 15న ప్రారంభించిన రైతు బీమా పథకం నేటితో ఐదేండ్లు పూర్తి చేసుకున్నది.

    అర్హులైన రైతులందరి తరపున ప్రభుత్వమే ఎల్ఐసికి (LIC)ప్రీమియం చెల్లిస్తూ, ఇంటి పెద్దను కోల్పోయిన ఆ… pic.twitter.com/0hRfmYfxd9

    — Harish Rao Thanneeru (@BRSHarish) August 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

KTR on Telangana IT Development : 'తెలంగాణ వచ్చాక 6 లక్షలకుపైగా ఐటీ ఉద్యోగాలొచ్చాయి'

Harish Rao Fires on BJP Leaders : 'కేసీఆర్​ పట్టుబట్టి కాళేశ్వరం కడితే.. బీజేపీ తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది'

elangana Diagnostics : తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌.. అందుబాటులోకి 134 వైద్య పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.