ETV Bharat / state

రాష్ట్రంలోనే మొదటి పునరావాస కాలనీ - కాళేశ్వరం ప్రాజెక్టు

రాష్ట్రంలోనే మొదటి పునరావాస కాలనీని సిద్దిపేటలో ఆర్థిక మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన వారికి అండగా ఉండి ఆదుకుంటామని.. నిర్వాసితులకు భరోసా ఇచ్చారు. అనంతగిరి జలాశయంలో ముంపునకు గురవుతున్న కొచ్చగుట్టపల్లి పునరావాస గ్రామాన్ని నిర్మించారు.

రాష్ట్రంలో మొదటి పునరావాస కాలనీ ప్రారంభించిన మంత్రి హరశ్​రావు
author img

By

Published : Nov 7, 2019, 8:04 AM IST

రాష్ట్రంలో మొదటి పునరావాస కాలనీ ప్రారంభించిన మంత్రి హరశ్​రావు

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో మొదటి పునరావాస గ్రామాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న అనంతగిరి జలాశయంలో ముంపునకు గురవుతున్న కొచ్చగుట్టపల్లికి సిద్దిపేట పట్టణ శివారులో పునరావాస కాలనీ నిర్మించారు. సామూహిక గృహ ప్రవేశాల్లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.. రిబ్బన్ కత్తిరించి లబ్ధిదారులను ఇళ్లలోకి అడుగుపెట్టించారు.

దేశంలో మొదటి పునరావాస కాలనీ

నిర్వాసితులకు భూసేకరణ చట్టం- 2013 కంటే మెరుగైన పరిహారం ఇచ్చామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. చట్టం ప్రకారం 75 గజాల్లో ఇల్లు నిర్మిస్తే సరిపోతుందని.. కానీ.. తాము 250 గజాల విస్తీర్ణంలో రెండు పడక గదుల ఇల్లు నిర్మించి ఇస్తున్నామని ఆయన అన్నారు. కొత్త భూసేకరణ చట్టం వచ్చిన తర్వాత దేశంలో ఏర్పాటు చేసిన మొదటి పునరావాస కాలనీ అని హరీష్ రావు అన్నారు. అన్నీ రకాల మౌలిక వసతులతో పునరావాస కాలనీ అంటే ఇలా ఉండాలి అనేలా వీటిని నిర్మించామన్నారు.

నిర్వాసితులపై ప్రత్యేక దృష్టి

ఆదాయ, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి నిర్వాసితులకు భరోసా ఇచ్చారు. అనంతగిరి జలాశయంలో చేపలు పట్టుకునే హక్కులు శాశ్వతంగా కల్పిస్తామని.. సిద్దిపేట పారిశ్రామిక పార్కులో ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్​లో ఎటువంటి ఇబ్బందులున్నా అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.

పునరావాస కాలనీపై నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్లు, విద్యుత్, తాగు నీరు వంటి మౌలిక వసతులతో నిర్మించారని.. గేటెడ్ కమ్యూనిటిలా ఉందని.. లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నిర్వాసితుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించిందని.. వారికి అన్నీ విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఇదీ చూడండి : బీమా చెక్కులు అందించిన కేటీఆర్​

Tg_srd_02_06_opening_pkg_3180660 రిపోర్టర్: క్రాంతికుమార్, స్టాఫర్ కెమెరా: పరుష రాములు, కంట్రిబ్యూటర్, సిద్దిపేట Note: విజువల్స్, హరీష్ రావు బైట్లు ACE మీడియా ద్వారా వచ్చిన ఫీడ్ నుంచి వాడుకోగలరు. * లబ్ధిదారుల బైట్లు మోజోలో వచ్చాయి. () రాష్ట్రంలోనే మొదటి పునరావాస కాలనీని సిద్దిపేటలో ప్రారంభించినందుకు ఆనందంగా ఉందని ఆర్థిక మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆనంతగిరి జలాశయంలో ముంపునకు గురవుతున్న కొచ్చగుట్టపల్లి పునరావాస గ్రామాన్ని హరీష్ రావు ప్రారంభించారు. ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటామని నిర్వాసితులకు ఆయన భరోసా ఇచ్చారు.....Look VO: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో మొదటి పునరావాస గ్రామాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న అనంతగిరి జలాశయంలో ముంపునకు గురవుతున్న కొచ్చగుట్టపల్లికి సిద్దిపేట పట్టణ శివారులో పునరావాస కాలనీ నిర్మించారు. సామూహిక గృహ ప్రవేశాల్లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.. రిబ్బన్ కత్తిరించి లబ్ధిదారులను ఇళ్లలోకి తోలారు......Spot VO: నిర్వాసితులకు భూసేకరణ చట్టం- 2013 కంటే మెరుగైన పరిహారం ఇచ్చామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. చట్టం ప్రకారం 75గజల్లో ఇల్లు నిర్మిస్తే సరిపోతుందని.. కానీ.. తాము 250గజాల విస్తీర్ణంలో రెండు పడక గదుల ఇల్లు నిర్మించి ఇస్తున్నామని ఆయన అన్నారు. కొత్త భూసేకరణ చట్టం వచ్చిన తర్వాత దేశంలో ఏర్పాటు చేసిన మొదటి పునరావాస కాలనీ అని హరీష్ రావు అన్నారు. అన్నీ రకాల మౌలిక వసతులతో పునరావాస కాలనీ అంటే ఇలా ఉండాలి అనేలా దీన్ని నిర్మించామన్నారు.....Byte బైట్: హరీష్ రావు, మంత్రి Vo: ఆదాయ, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి నిర్వాసితులకు భరోసా ఇచ్చారు. అనంతగిరి జలాశయంలో చేపలు పట్టుకునే హక్కులు శాశ్వతంగా కల్పిస్తామని.. సిద్దిపేట పారిశ్రామిక పార్కులో ఉద్యోగాల్లో ప్రాధమ్యం ఇస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్ లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అండగా నిలుస్తామని స్పష్టం చేశారు......Byte బైట్: హరీష్ రావు, మంత్రి Vo: కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్, తెదేపా అనేక ప్రయత్నాలు చేశాయని హరీష్ రావు ఆరోపించారు. కాళేశ్వరం నీళ్లు భూపాలపల్లి, వరంగల్, సూర్యాపేట జిల్లాలను తకాయన్నారు. త్వరలో సిద్దిపేట జిల్లాకు నీళ్లు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. జలాశయాల్లో సంవత్సరం పొడవునా నీళ్లు ఉంటాయని తెలిపారు......byte బైట్: హరీష్ రావు, మంత్రి Vo: పునరావాస కాలనీపై నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్లు, విద్యుత్, తాగు నీరు వంటి మౌలిక వసతులతో నిర్మించారని.. గేటెడ్ కమ్యూనిటిలా ఉందని.. లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు......Byte బైట్: లబ్ధిదారుడు బైట్: లబ్ధిదారుడు Evo: నిర్వాసితుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించిందని.. వారికి అన్నీ విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.