ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా బాధిత కుటుంబాలకు, మున్సిపల్ కార్మికులకు ఆర్థిక సహాయం సరుకులు అందించడం మానవత్వానికి నిదర్శనం అన్నారు దుబ్బాక మున్సిపల్ కమిషనర్ నరసయ్య. సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో మున్సిపల్ కౌన్సిలర్లు, ఎస్సై స్వామి ఆధ్వర్యంలో దాతల సహకారంతో వచ్చిన లక్ష రూపాయల నగదును, నిత్యావసర సరుకులను కరోనా బాధిత కుటుంబాలకు, మున్సిపాలిటి కార్మికులకు అందించారు.
కరోనా మహమ్మారి వల్ల దుబ్బాక పట్టణంలో కరోనాతో చనిపోయిన తల్లి, కొడుకు కుటుంబానికి, వారి అంత్యక్రియల్లో పాల్గొన్న మున్సిపల్ సిబ్బందికి పలు బాధిత కుటుంబాలకు నగదు,నిత్యావసర సరుకులను అందజేశారు. అడగగానే సహకరించిన దాతలకు పేరుపేరునా మున్సిపల్ కౌన్సిలర్లు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మహమ్మారి నుండి రక్షించుకోడానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ వాడాలని సూచించారు. దుబ్బాకలో కరోనా కేసులు రాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు వహించాలని.. మంచి ఆహారం తీసుకోవాలని దుబ్బాక ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చింత రాజు అన్నారు.
ఇదీ చూడండి: కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు