సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రామక్కపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం దుబ్బాక నియోజకవర్గ ప్రచార కార్యదర్శి శ్రీరాం రామకృష్ణ ప్రభు ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
కొవిడ్-19 ప్రభావంతో పని లేకుండా పస్తులు ఉంటున్న కుటుంబాలను గుర్తించి... వారికి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటి వరకు దాతల సహకారంతో నాలుగు వందలకు పైగా పేద కుటంబాలకు చేయూతనిచ్చామని తెలిపారు.
ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ... దూరం పాటిస్తూ... కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని సూచించారు. దాతలకు కృతజ్ఞతలు తెలిపి... వారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు.
ఇవీ చూడండి: అమెరికాలో తుపాను బీభత్సం.. భయం గుప్పిట్లో ప్రజలు!