గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెళ్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన గవర్నర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమిళిసై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. కార్తికమాసంలో మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషకరమని గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కొమురవెల్లికి రైల్వే కనెక్షన్ త్వరగా పూర్తయ్యేలా కేంద్ర రైల్వే శాఖ మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి పనులు పూర్తయ్యేలా చూస్తామన్నారు.
పారిశుద్ధ్య కార్మికురాలి ఇంటికెళ్లిన గవర్నర్ తమిళిసై..: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఓ పారిశుద్ధ్య కార్మికురాలి ఇంటికి వెళ్లారు. సిద్దిపేట జిల్లా పర్యటన అనంతరం వీరబైరాన్‌పల్లి మీదుగా హైదరాబాద్ వస్తున్న గవర్నర్ కారును చేర్యాల వద్ద పారిశుద్ధ్య కార్మికురాలు సంధ్యారాణి అడ్డుతగిలారు. తన ఇల్లు కూలిపోయిందని.. న్యాయం చేయాలని గవర్నర్‌ను వేడుకున్నారు. సంధ్యారాణి విజ్ఞప్తి మేరకు గవర్నర్ కారు దిగి వెళ్లి ఆమె ఇంటిని పరిశీలించారు. సంధ్యారాణి ఆధార్ కార్డు వివరాలను తీసుకున్న తమిళిసై.. ప్రభుత్వం ద్వారా సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి..
ఉమ్మడి నియామక బోర్డు ద్వారా నియామకాల్లో పారదర్శకత ఉండాలి: గవర్నర్
డేరా బాబాకు బాలుడిని దానం చేసిన తల్లిదండ్రులు.. మగ పిల్లలు పుడతారన్న ఆశతో..