ETV Bharat / state

గజ్వేల్​లో గుట్టుగా గ్లైఫోసెట్​ అమ్మకాలు

సిద్ధిపేట జిల్లా గజ్వేల్​లో కేంద్రప్రభుత్వం రద్దు చేసిన గ్లైఫోసెట్ ప్రమాదకర కలుపు నివారణ మందును అమ్ముతున్నారు. అనుమతి లేకుండా అమ్మిన వారిపై చర్యలు తీసుకుంటామని ఏడీఎ అనిల్ తెలిపారు.

గజ్వేల్​లో గుట్టుగా గ్లైఫోసెట్​ అమ్మకాలు
author img

By

Published : Aug 4, 2019, 7:13 PM IST

గ్లైఫోసెట్‌.. ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదకర కలుపు నివారణ మందు. గజ్వేల్‌ డివిజన్‌ పరిధిలో జోరుగా ఈ మందు విక్రయాలు సాగుతున్నాయి. చాటుగా వంగడాలు కొనుగోలు చేసి.. బీటీ-3 పత్తిని సాగు చేసిన రైతులు ప్రస్తుతం కలుపు నివారణకు గ్లైఫోసెట్‌ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సిఫారసు లేఖ లేనిది.... ఆ మందును అమ్మకూడదు. కానీ రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు డీలర్లు గుట్టుగా సొమ్ము చేసుకుంటున్నారు. గతంలోనే గ్లైఫోసెట్​ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఎరువుల దుకాణాలపై నిఘా పెడుతున్నామని, అధికారుల అనుమతి లేకుండా అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని గజ్వేల్ ఏడీఎ అనిల్ తెలిపారు.

ఇదీ చూడండి:తెలంగాణలో యోగా యూనివర్సిటీ స్థాపనకు కృషిచేస్తా: హరీశ్​ రావు

Intro:Body:

df

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.