సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో శోభాయాత్రను నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పురవీధుల గుండా శోభాయాత్ర కొనసాగించారు.
స్థానిక గాంధీ చౌక్ వద్ద లడ్డూ వేలం వేశారు. అనంతరం గ్రామంలోని పెద్ద చెరువులో వినాయకులను నిమజ్జనం చేశారు. పరిమిత సంఖ్యలో గ్రామ పెద్దలు, యువత నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవీచూడండి: జనాభా లెక్కలు ఈ ఏడాది లేనట్టే!