ETV Bharat / state

కేసీఆర్ నియోజకవర్గానికి మొదటిసారిగా రైలొచ్చిందోచ్...

ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌ రైల్వే స్టేషన్‌కు తొలిసారి సరకు రవాణా రైలు వచ్చింది. కాకినాడ నుంచి ఎరువులతో గూడ్స్ రైలు వచ్చింది. ఎరువుల రేకు పాయింట్‌ను మంత్రులు హరీశ్, నిరంజన్‌రెడ్డిలు ప్రారంభించారు.

Gajwel
కేసీఆర్ నియోజవర్గానికి మొదటిసారిగా రైలొచ్చిందోచ్...
author img

By

Published : Jun 27, 2022, 8:24 PM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్‌లో... ఎరువుల రేకు పాయింట్‌ను మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. కాకినాడ ఎమ్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి 21 బోగిల్లో గజ్వేల్‌కు... 1300 మెట్రిక్ టన్నుల ఎరువులు చేరుకున్నాయి. గజ్వేల్‌ నుంచి ఆయా ప్రాంతాలకు ట్రక్కుల్లో ఎరువులను పంపించారు. తెలంగాణకు వస్తున్న భాజపా పెద్దలు ఇక్కడకి వచ్చి ఏం చెబుతారంటూ... పలు అంశాలపై కేంద్రాన్ని మంత్రి హరీశ్‌రావు నిలదీశారు.

''వరంగల్‌కు మంజూరైన రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ గుజరాత్‌కు తరలించుకోపోయారు. ధాన్యం కొనకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారంటూ'' హరీశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాన్ని ఏలుతున్న పార్టీ... వరిసాగులో ధాన్యం కొనుగోలులో బాధ్యతారహితంగా వ్యవహరించిందని... మంత్రి నిరంజన్‌ రెడ్డి ఆరోపించారు.

ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా ద‌శాబ్దాల పోరాటం ఫ‌లితంగా రేక్ పాయింట్ ఏర్పాటైంది. ఈ రేక్ పాయింట్ జిల్లా ప్ర‌జ‌ల‌కు ఓ వ‌రం. కేంద్రానిదే రైల్వే లైన్ బాధ్య‌త. ఈ రైల్వే లైన్ కోసం నాటి సీఎంలు కిర‌ణ్ కుమార్ రెడ్డి, రోశ‌య్య నిధులు ఇచ్చేవారు కాద‌ు. కానీ తెలంగాణ ఏర్పాటు త‌ర్వాత రాష్ట్ర ప్ర‌భుత్వం మూడో వంతు నిధుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఇచ్చింది. కొత్త‌ప‌ల్లి–మ‌నోహ‌రాబాద్ రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.600 కోట్లు ఖ‌ర్చు చేసింది. ఈ లైన్ కోసం 2,200 ఎక‌రాల భూసేక‌ర‌ణ చేశాం. - హరీశ్‌రావు, మంత్రి

కేసీఆర్ నియోజవర్గానికి మొదటిసారిగా రైలొచ్చిందోచ్...

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.