సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో వానరానికి అంతక్రియలు నిర్వహించారు. స్థానిక వెంకటేశ్వర మిల్లు వద్ద ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందిన వానరానికి ఎన్టీఆర్ హమాలీ సంఘం ఆధ్వర్యంలో అంతక్రియలు చేశారు. గత మూడేళ్ల క్రితం కూడా ఇలాగే విద్యుదాఘాతంతో చనిపోయిన కోతికి అంత్యక్రియలు చేసినట్లు సంఘ సభ్యులు తెలిపారు.
ఇవీ చూడండి: దిల్లీలో పట్టపగలు రూ.50లక్షలు చోరీ