సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పలు సూపర్ మార్కెట్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ రవీందర్రావు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా రంగదాంపల్లి రోడ్లో ఉన్న వి.మార్ట్ స్టోర్స్, మటన్ మార్కెట్, మిట్టపల్లిలోని రెండు కోల్డ్ స్టోరేజ్‌లను ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కరోనా సందర్భంగా వారికి తగిన సలహాలు సూచనలు ఇచ్చారు.
భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని కోరారు. ఏ వస్తువైనా అధిక ధరలకు అమ్మితే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మటన్, చికెన్ మార్కెట్లను తనిఖీ చేసి మాంసం తాజాగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మాంసం ఫ్రిజ్లో పెట్టి అమ్మకూడదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.