రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు ప్రమాదం తప్పింది. రాజీవ్ రహదారిపై అడవి పందుల గుంపు అడ్డురాగా ముందు వెళుతున్న కారు డ్రైవర్ సడన్ బ్రేకు వేయడంతో మంత్రి కాన్వాయ్‌లో వెనుక వస్తున్న రెండు కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు. మూడు వాహనాలు మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే చరవాణిలో మంత్రితో మాట్లాడారు. అదనపు ఎస్పీ రామేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం సిద్దిపేటలో సీఎం పర్యటన ముగిసిన తరువాత రాత్రి 8.30 గంటల ప్రాంతంలో హరీశ్‌రావు హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు. కాన్వాయ్ సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారుకు వచ్చేసరికి హఠాత్తుగా అడవి పందుల గుంపు రోడ్డుపైకి దూసుకొచ్చింది.
అప్రమత్తమైన పైలట్ వాహనం డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశారు. ఆ వెనుకే ఉన్న మంత్రి హరీశ్‌రావు ప్రయాణిస్తున్న కారు, బుల్లెట్ ప్రూఫ్ కారు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. వరుసగా మూడుకార్లు ఢీకొనడంతో వెనుక ఉన్న వాహన చోదకుడు మాణిక్యం స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనలో డ్రైవర్లు చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంత్రి కారు దిగి పరిస్థితిని పరిశీలించారు. ఆ తరువాత మరో వాహనంలో హైదరాబాద్ బయల్దేరారు. ఈ ఘటనలో ఓ అడవి పంది చనిపోయింది. ఘటనా స్థలిని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ రాత్రి 10 గంటల సమయంలో పరిశీలించారు. ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు.
సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న క్రమంలో కొండపాక వద్ద నా కారుకు ప్రమాదం జరిగింది. నేను క్షేమంగానే ఉన్నా. నా డ్రైవర్, గన్‌మెన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వారు కూడా క్షేమంగానే ఉన్నారు. దయచేసి శ్రేయేభిలాషులు, మిత్రులు ఆందోళన చెందొద్దని కోరుతున్నా.
-హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి
-
సిద్ధిపేట నుండి హైదరాబాద్ కు తిరుగుప్రయాణంలో కొండపాక వద్ద నా కారుకు ప్రమాధం జరిగింది. నేను క్షేమంగానే ఉన్నా. నా డ్రైవర్, గన్ మెన్ కు స్వల్ప గాయాలయ్యాయి. వారు కూడా క్షేమంగానే ఉన్నారు. దయచేసి శ్రేయేభిలాషులు, మిత్రులు ఆంధోళన చెందవద్దని కోరుతున్నా.
— Harish Rao Thanneeru (@trsharish) June 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">సిద్ధిపేట నుండి హైదరాబాద్ కు తిరుగుప్రయాణంలో కొండపాక వద్ద నా కారుకు ప్రమాధం జరిగింది. నేను క్షేమంగానే ఉన్నా. నా డ్రైవర్, గన్ మెన్ కు స్వల్ప గాయాలయ్యాయి. వారు కూడా క్షేమంగానే ఉన్నారు. దయచేసి శ్రేయేభిలాషులు, మిత్రులు ఆంధోళన చెందవద్దని కోరుతున్నా.
— Harish Rao Thanneeru (@trsharish) June 20, 2021సిద్ధిపేట నుండి హైదరాబాద్ కు తిరుగుప్రయాణంలో కొండపాక వద్ద నా కారుకు ప్రమాధం జరిగింది. నేను క్షేమంగానే ఉన్నా. నా డ్రైవర్, గన్ మెన్ కు స్వల్ప గాయాలయ్యాయి. వారు కూడా క్షేమంగానే ఉన్నారు. దయచేసి శ్రేయేభిలాషులు, మిత్రులు ఆంధోళన చెందవద్దని కోరుతున్నా.
— Harish Rao Thanneeru (@trsharish) June 20, 2021
ఇదీ చదవండి: Cm Kcr Story: సీఎం కేసీఆర్ చెప్పిన కలియుగ రాక్షసుల కథ