ETV Bharat / state

Finance Minister:భూమికి బరువైన పంట పండింది: హరీశ్ రావు - telangana news

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రైతుల జీవితాలు బాగుపడతాయని... ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాట నేడు నిజమైందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రైతులు చినిగిన పంచెలు కాదు.. పట్టు పంచెలు కట్టుకునే రోజులు వస్తున్నాయని పేర్కొన్నారు. రైతు బిడ్డకే పిల్లనిస్తమనే కాలం తిరిగి రావాలనేదే కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని మగ్దుంపూర్ గ్రామ పరిధిలో ఆయిల్ పామ్ సాగుకు శ్రీకారం చుట్టారు.

FinanFinance Minister Harish Rao ce Minister Harish Rao
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు
author img

By

Published : Jun 5, 2021, 5:50 PM IST

ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని మగ్దుంపూర్ గ్రామ పరిధిలో మొదటి ఆయిల్ పామ్ మొక్కను మంత్రి హరీశ్ రావు నాటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రైతుల జీవితాలు బాగు పడతాయని... ఆనాడు కేసీఆర్ చెప్పిన మాట నేడు నిజమైందని పేర్కొన్నారు. కాళేశ్వరం జలాలతో రాష్ట్రంలో సాగుభూమి పెరిగిందని తెలిపారు. పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను తలదన్నే విధంగా... భూమికి బరువైన పంట పండిందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ధాన్యం కొనుగోళ్లు చేస్తలేదని... కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్లు చేస్తోందని పేర్కొన్నారు.

ప్రతి ఏటా మన దేశంలో 90 వేల కోట్ల పామాయిల్​ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. దీనిని నియంత్రించడం కోసం మన దేశం 70 లక్షల ఎకరాల్లో పామాయిల్ తోటలు సాగు చేయాలని అన్నారు. పామాయిల్​ సాగు చేయడం వలన వచ్చే లాభాలను సవివరంగా వివరించారు. పామాయిల్ కు బహిరంగ మార్కెట్లో పుష్కలమైన డిమాండ్ ఉందని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర అందించేలా.. అన్నిరకాల ప్రోత్సాహకాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

పామాయిల్ తోటలు సాగు చేసే రైతులు కేవలం రూ. 6 వేలు కడితే సరిపోతుందని... మిగతా రూ. 1 లక్షా 35 వేల 240 ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుందని మంత్రి వివరించారు. వ్యవసాయంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రైతులను చూసి ఒకనాడు నవ్విన ఆంధ్రా పాలకులు.., నేడు మనల్ని చూసి ఈర్ష్య పడటం గర్వంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రామి రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్​డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Tammineni: 'ఈటల.. భాజపా పంచన చేరటం సిగ్గుచేటు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.