పరీక్షల సమయంలో పిల్లలు టీవీలు, సెల్ఫోన్లకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు చూడాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. విద్య కేవలం ఉద్యోగం కోసం కాకుండా.. సమాజ స్పృహ, చైతన్యం కలిగించేలా ఉండాలని సూచించారు.
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మోడల్ స్కూల్ వార్షికోత్సవానికి హాజరైన మంత్రి.. విద్యాప్రమాణాలు పెరిగేందుకు ప్రతి అధ్యాపకుడు కృషి చేయాలని సూచించారు. నైతిక విలువలను విద్యార్థులు బోధించాలని దిశానిర్దేశం చేశారు.
విద్యార్థులను స్టేజీపైకి పిలిచి మంత్రి హరీశ్‌రావు ఎక్కాలను అడిగారు. కొందరు సరైన సమాధానం చెప్పకపోవడం వల్ల అధ్యాపకబృందం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పదోతరగతిలో 10/10 జీపీఏ సాధించిన వారికి రూ.25వేల పారితోషికం అందిస్తామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
- ఇవీచూడండి: హైదరాబాద్‌లో 'పౌర' సెగ: వామపక్ష నేతల అరెస్ట్