ఓ బీఆర్ఎస్ నాయకుడి కుమారుడితో పాటు ఆయన స్నేహితులు మద్యం మత్తులో శుక్రవారం అర్ధరాత్రి ఐస్‌క్రీం కోసం హల్‌చల్ చేశారు. ఐస్ క్రీం పార్లర్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఎదురుదాడిని తప్పించుకునే క్రమంలో బీఆర్ఎస్ నేత కుమారుడు గాయపడ్డాడు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి కుమారుడు భరత్‌రెడ్డి.. హైదరాబాద్‌లోని గండిమైసమ్మ ప్రాంతంలో ఓ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు.
ఆయనతో పాటు అదే కాలేజీలో చదువుతున్న భరత్‌రెడ్డి స్నేహితులు శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో మద్యం తాగారు. అర్ధరాత్రి 1 గంట తరువాత భరత్‌రెడ్డి.. ఆయన స్నేహితులు బంజారాహిల్స్‌లోని ఓ ఐస్ క్రీం పార్లర్‌కు వెళ్లి ఐస్ క్రీం కావాలంటూ షాపు తలుపు తట్టారు. సమయం ముగిసిందని అందులో పని చేస్తున్న సిబ్బంది షోయబ్, చందు, వెంకటేశ్ చెప్పారు. అయినా వినిపించుకోని భరత్‌రెడ్డి, అతని స్నేహితులు బలవంతంగా షట్టర్ తెరిచి లోనికి వెళ్లారు.
ఐక్ క్రీం ఎందుకు ఇవ్వరంటూ భరత్‌రెడ్డితో పాటు అతని స్నేహితులు షాపులోని ముగ్గురితో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత బయటికి వెళ్లి మరికొంత మంది స్నేహితులను తీసుకొచ్చి చందు, షోయబ్, వెంకటేశ్‌లపై దాడికి పాల్పడ్డారు. ఆ ముగ్గురు భరత్‌రెడ్డి, వారి స్నేహితుల చేతుల్లో ఉన్న కర్రలు లాక్కొని ఎదురుదాడి చేయడంతో తప్పించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో భరత్‌రెడ్డి కిందపడిపోవడంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది.
fight for ice cream: స్నేహితులు అతడిని జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. విషయం తెలుసుకున్న వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అక్కడికి చేరుకొని భరత్‌రెడ్డి స్నేహితులను మందలించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి ఇరువర్గాల పరస్పర ఫిర్యాదుల మేరకు రెండు బృందాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Attack on petrol bunk workers: రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. సరిగ్గా వారం రోజుల కిందట దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధి బహదూర్‌పల్లిలోని శ్రీ సిద్ది వినాయక పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్న ఇద్దరు సిబ్బందిపై రాత్రి 10 గంటల సమయంలో ముగ్గురు యువకులు దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు పెట్రోల్ కోసమని బంక్ వద్దకు రాగా.. పెట్రోల్ పంపు పని చేయకపోవడంతో ఐదు నిమిషాలు ఆగమని బంకు సిబ్బంది చెప్పారు. దీంతో ఆగ్రహించి బంక్ సిబ్బంది శ్రీకాంత్ (24), అనిల్ (18)పై ఇటుకలతో దాడి చేశారు. ముగ్గురిపై పెట్రోల్ బంక్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి:
మద్యం మత్తులో పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు
కోరిక తీర్చమంటూ ఆ ఎమ్మెల్యే వేధిస్తున్నాడు: మహిళా సర్పంచ్
'ఆపండీ'.. పెళ్లైన ఏడు గంటలకే పుట్టింటికి యువతి.. కారణం తెలిస్తే షాక్!